Gouthu Sireesha: ఇలాంటి ఊసరవెల్లి నేతలను పార్టీలోకి తీసుకోవద్దు... టీడీపీ హైకమాండ్ కు గౌతు శిరీష విజ్ఞప్తి

Gouthu Sireesha tweets about Pothula Suneetha
  • వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా
  • ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడి
  • ఈ నేపథ్యంలో, చర్చనీయాంశంగా మారిన గౌతు శిరీష ట్వీట్
వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేయడం తెలిసిందే. పోతుల సునీత ఏ పార్టీలో చేరేది ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

"టీడీపీ పార్టీ పెద్దలకు మనవి. దయచేసి ఇలాంటి ఊసరవెల్లి నాయకులను మన పార్టీలోకి తీసుకోవద్దు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లని పార్టీలోకి తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయతీగా పోరాడిన వాళ్లను అవమానించినట్టే" అంటూ గౌతు శిరీష ట్వీట్ చేశారు. పోతుల సునీత రాజీనామా వార్త క్లిప్పింగ్ ను కూడా శిరీష పంచుకున్నారు.
Gouthu Sireesha
TDP
Pothula Suneetha
YSRCP
Andhra Pradesh

More Telugu News