Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మించేందుకు కేంద్రం సుముఖత

Centre willing to complete Polavaram project
  • జాతీయ ప్రాజెక్టుగా పోలవరం
  • కొన్నాళ్లుగా కొనసాగుతూనే ఉన్న నిర్మాణ పనులు
  • ఇటీవల పలు దఫాలుగా కేంద్రంతో చంద్రబాబు చర్చలు
  • పోలవరం నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. 

ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు దఫాలుగా కేంద్రంతో పోలవరంపై చర్చించారు. ప్రధానమంత్రి, ఆర్థిక, జలశక్తి మంత్రులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో, కేంద్రం నుంచి సానుకూల స్పందన వెలువడింది. 

జాతీయ ప్రాజెక్టు పోలవరంను పూర్తిగా నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వెలిబుచ్చింది. బకాయిలు సహా, నిధులన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.
Polavaram Project
Centre
Construction
Andhra Pradesh

More Telugu News