Ch Malla Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కాలేజీలకు నోటీసులు

Revenue Officials Issues Notices To BRS MLA Marri Rajasekhar Reddy Colleges
  • దుండిగల్‌లోని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలకు రెవెన్యూ అధికారుల నోటీసులు
  • చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో నిర్మించారన్న అధికారులు
  • విద్యా సంస్థల కూల్చివేతల విషయంలో సంయమనం పాటిస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతతో ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరుగెత్తిస్తోంది. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామని హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే, విద్యాసంస్థల విషయంలో కొంత సంయమనం పాటిస్తామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాటికి కొంత సమయం ఇస్తామని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందజేసిన అధికారులు.. వాటిని చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో నిర్మించారని పేర్కొన్నారు.
Ch Malla Reddy
Marri Rajashekar Reddy
MLRIT
Institute of Aeronautical Engineering

More Telugu News