రేవంత్ రెడ్డి దూకుడుతనమే ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- పాతబస్తీలోనూ చెరువులు కబ్జాకు గురయ్యాయన్న బీజేపీ నేత
- ఒవైసీ కాలేజీని కూల్చే దమ్ముందా? అని సవాల్
- ఇతర అంశాలను పక్కదారి పట్టించేందుకే హైడ్రాకు హైప్ తెచ్చారని ఆరోపణ
మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ సఖ్యతతో ఉంటోందని, అలాంటప్పుడు ఒవైసీ కాలేజీని ఎలా కూలగొడతారన్నారు. ఇతర అంశాలను పక్కదారి పట్టించేందుకే హైడ్రాకు అంతగా హైప్ తీసుకువచ్చారని ఆరోపించారు. కూల్చివేతల గురించి జనం చర్చించుకుంటే ఇతర అంశాల గురించి మాట్లాడుకోరని వారు భావిస్తున్నారన్నారు.
అందరికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఏలేటి ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి, మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతమందికి రుణమాఫీ అయింది? ఇంకా ఎంతమందికి కావాల్సి ఉంది? చెప్పాలన్నారు. రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని సీఎం చెబుతున్నారని, కానీ మంత్రులేమో రూ.17 వేల కోట్లు మాత్రమే అయ్యాయని అంటున్నారని విమర్శించారు. ఇందులో ఎవరి మాటను నమ్మాలని అడిగారు.