Mahesh Babu: 'ముఫాసా: ది ల‌య‌న్ కింగ్' ట్రైల‌ర్ విడుద‌ల చేసిన మ‌హేశ్ బాబు

Extremely excited to be the voice of Mufasa in Telugu says Mahesh Babu
'ముఫాసా: ది ల‌య‌న్ కింగ్' మూవీకి సంబంధించిన తెలుగు ట్రైల‌ర్‌ను ప్రిన్స్ మ‌హేశ్ బాబు తాజాగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఈ మూవీలో వాయిస్ అందించే అవ‌కాశం ల‌భించినందుకు ఆనందంగా ఉంద‌ని సూప‌ర్ స్టార్ తెలిపారు. ఇందులో ఆయ‌న సింహం ముఫాసాకు గాత్ర‌దానం చేశారు. 

ట్రైల‌ర్‌లో సింహానికి ప్రిన్స్ వాయిస్‌, డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ముఫాసాకు మ‌హేశ్ బేస్ వాయిస్ బాగా స‌రిపోయింద‌ని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది చివ‌రిలో డిసెంబ‌ర్ 20న ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది.
Mahesh Babu
Mufasa
Tollywood

More Telugu News