Woman Escape: గూడ్స్ ట్రైన్ కింద పడ్డా ప్రాణాలతో బయటపడ్డ మహిళ.. వీడియో ఇదిగో!

Woman Miraculous Escape After Train Passes Over Her In Telangana
  • తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘటన
  • పట్టాలు దాటుతూ పడిపోయిన మహిళ
  • ట్రైన్ దగ్గరికి రావడంతో అలాగే పడుకుండిపోవడంతో దక్కిన ప్రాణం
ఓవైపు రైలు వస్తుండగా పట్టాలు దాటే ప్రయత్నం చేసిందో మహిళ.. రైలు వచ్చేస్తోందనే కంగారులో పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది. ఇంతలో ట్రైన్ దగ్గరికి రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అలాగే కదలకుండా పడుకుండిపోయింది. దీంతో ట్రైన్ ఆమె పై నుంచి పోయినా ప్రాణాలు కాపాడుకోగలిగింది. ఇదంతా రైల్వే స్టేషన్ లో ఉన్న ఇతర ప్రయాణికులు తమ సెల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలంగాణలోని  వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఆదివారం చోటుచేసుకుందీ ఘటన. ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళలు నావంద్గి రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటి అవతలివైపు ఉన్న ప్లాట్ ఫాం పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. గూడ్స్ ట్రైన్ నెమ్మదిగా వస్తుండడం చూసి హడావుడిగా దాటుతున్నారు. ఓ మహిళ పట్టాలు దాటగా.. మరో మహిళ మాత్రం పట్టాల మధ్యలో పడిపోయింది. దీంతో కొన్ని సెకండ్ల పాటు అలాగే రాళ్లపైన అతుక్కుపోయినట్లు కదలకుండా ఉండిపోయింది. మధ్యలో ఒకసారి తల ఎత్తి చూసేందుకు ప్రయత్నించగా.. కెమెరాలో అదంతా రికార్డు చేస్తున్న వ్యక్తి హెచ్చరించడం వీడియోలో వినిపించింది.
Woman Escape
Train Accident
Viral Videos
Telangana
Vikarabad

More Telugu News