శ్రీకృష్ణాష్టమి స్పెషల్.. ఆకట్టుకుంటున్న సుదర్శన్ పట్నాయక్ అద్భుత కళాఖండం!
ఇక నేడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆయన మరో అద్భుతమైన కళాఖండానికి ప్రాణం పోశారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 'కిల్ ద ఈవిల్' అనే సందేశంతో ఆయన శ్రీకృష్ణుడి సైకత శిల్పాన్ని తీర్చిద్దారు. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ శిల్పం బీచ్‌కు వచ్చేవారిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సుదర్శన్ పట్నాయక్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అద్భుతమైన కళాఖండం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.