Chitrapuri: చిత్రపురి కాలనీలో పలు విల్లాలకు నోటీసులు

Manikonda Munsipal Commissionar Issues Notice to Chitrapuri Colony Villa Owners
  • జీ+1 అనుమతులతో జీ+2 నిర్మాణం చేసినట్లు గుర్తింపు
  • 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
  • లేదంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు నిర్మాణాలకు కమిషనర్ నోటీసులు జారీ చేశారు. చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు ఈ నోటీసులు ఇచ్చారు. జీ+1 నిర్మాణానికి అనుమతులు పొంది జీ+2 నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు.

చిత్రపురి కాలనీలో జీవో 658 కి విరుద్ధంగా 225 రో హౌస్ లు కట్టినట్లు మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ విల్లాల నిర్మాణానికి జీ+1 మాత్రమే అనుమతి ఉంది. కాగా, గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగిందని ఫిర్యాదులు అందాయి. దీంతో అవకతవకల విషయం తేల్చేందుకు మణికొండ మున్సిపల్ కమిషనర్ తాజాగా నోటీసులు జారీ చేశారు.
Chitrapuri
Manikonda
Villas
Muncipality
Notice

More Telugu News