నాగార్జున‌కు ఊర‌ట‌... ఎన్ కన్వెన్షన్ కూల్చివేత‌లు ఆపాల‌న్న కోర్టు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. 

ఈ హౌస్ మోషన్ పిటిష‌న్‌ను విచారించిన న్యాయ‌స్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతల‌ను ఆపాల‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ టి. వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్ల‌డించారు.

N Convention Demolistion
TS High Court
Nagarjuna
Telangana

More Telugu News