Raviteja: ఆసుపత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జి

Hero Ravitheja discharge from hospital
  • భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ కొత్త చిత్రం
  • షూటింగ్ లో కుడిచేతికి గాయం
  • గాయంతోనే షూటింగ్ కొనసాగించిన రవితేజ
  • గాయం తీవ్రం కావడంతో శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లు
ఎనర్జటిక్ హీరో రవితేజ కుడి చేతికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. షూటింగ్ లో గాయపడిన రవితేజ... గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్ కొనసాగించారు. దాంతో గాయం తీవ్రం కావడంతో చేతికి శస్త్రచికిత్స చేయక తప్పలేదు. 

కాగా, రవితేజ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. తాను డిశ్చార్జి అయిన విషయాన్ని రవితేజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ప్రస్తుతం  తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఎంతోమంది సందేశాలు పంపారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని వివరించారు. త్వరలోనే షూటింగ్ కు హాజరయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని రవితేజ ట్వీట్ చేశారు.
Raviteja
Surgery
Discharge
RT75
Tollywood

More Telugu News