Chandrababu: గ్రామ సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్

chandrababu govt good news for village secretariat employees
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
  • ఈ నెల 27లోగా బదిలీలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి
  • 29,30 తేదీల్లో బదిలీలకు కౌన్సిలింగ్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తోంది. బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు ఈ నెల 27లోగా అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా వచ్చిన ధరఖాస్తులను కలెక్టర్ లు పరిశీలించి వాటిని ప్రాధాన్యత కేటగిరీల వారీగా విభజిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో బదిలీల కౌన్సిలింగ్ కు దరఖాస్తు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరు కావాల్సి ఉంటుంది. 

పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్ లకు ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులను బదిలీలకు అనర్హులుగా పేర్కొంది. బదిలీ అయిన ఉద్యోగులకు టీటీఏ గానీ మరే ఇతర ప్రయోజనాలు కూడా లభించవు. ఏ ఉద్యోగీ తమ స్థానిక గ్రామ, వార్డుల్లో పోస్టింగ్ కోసం దరఖాస్తు చేయకూడదు. నాన్ ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు మించి పని చేసిన వారు బదిలీకి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.
Chandrababu
secretariat employees

More Telugu News