Hardik Pandya: హార్దిక్ పాండ్యా-నటాషా విడాకులకు గల షాకింగ్ కారణం ఎట్టకేలకు వెలుగులోకి!

Hardik Pandya Natasa Stankovic Divorce Reason Revealed
  • విడాకులకు ముమ్మాటి పాండ్యానే కారణమన్న సన్నిహిత వ్యక్తి
  • పాండ్యా అహం, నటాషాను పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరి మధ్య చెడిందట
  • నటాషా సర్దుకుపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందట
  • తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ విడాకులకు గల కారణం మొత్తానికి బయటకు వచ్చింది. నటాషా కంటే తానే ఎక్కువని హార్దిక్ పాండ్యా భావించడం, గర్వం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం వంటి కారణాల వల్లే ఇద్దరికీ చెడిందని చెబుతున్నారు. తనకు బాధగా, అసౌకర్యంగా ఉన్నప్పటికీ నటాషా సర్దుకుపోయేందుకే ప్రయత్నించిందని వారితో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఒకరు వెల్లడించారు. చివరికి తప్పని పరిస్థితుల్లోనే వారు విడిపోవాల్సి వచ్చిందని వివరించారు. 

‘‘అతడు ఆడంబరంగా ఉండేవాడు. స్వార్థపూరితంగా వ్యవహరించేవాడు. దీనిని నటాషా సహించలేకపోయింది. తమ మధ్య ‘గ్యాప్’ ఉన్నట్టు నటాషాకు అర్థమైంది. దీంతో ఆమె సర్దుకుపోవడానికి ప్రయత్నించింది. తనకు అసౌకర్యంగా అనిపించినప్పటికీ సర్దుకుపోయేందుకు ప్రయత్నించింది. కొన్ని రోజులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చూస్తుంటే ఇది అంతులేని ప్రక్రియలా తోచింది. దీంతో ఆమె ఒక అడుగు వెనక్కి వేయాలని నిర్ణయించుకుంది’’ అని ఆ జంటకు సన్నిహితంగా ఉండే వ్యక్తిని ఉంటంకిస్తూ ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. 

‘‘అతడు మారుతాడేమోనని ఆమె ఆశగా వేచి చూసింది. కానీ, మార్పు రాకపోవడంతో చివరికి బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఏ ఒక్క రోజులోనో, వారం రోజుల్లోనో తీసుకున్న నిర్ణయం కాదు. గాయం క్రమం పెరిగి పెద్దదై ఆమెను తీవ్రంగా బాధించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది’’ అని ఆ వ్యక్తి వివరించాడు.

పాండ్యా-నటాషా మే 2020లో హిందూ సంప్రదాయం ప్రకారం, ఫిబ్రవరి 2023లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో విడిపోయారు. ఈ మేరకు ఇద్దరూ వేర్వేరుగా ప్రకటించారు. కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని, కుమారుడు అగస్త్యకు ఇద్దరం కో పేరెంట్స్‌గా కొనసాగుతామని స్పష్టం చేశారు.
Hardik Pandya
Natasa Stankovic
Team India
Divorce

More Telugu News