Kolkata Incident: కోల్ కతా హత్యాచార ఘటన: నిందితుడు సంజయ్ రాయ్ కి 14 రోజుల కస్టడీ

Kolkata court remands Sanjay Roy 14 days judicial custody

  • ఈ నెల 9న కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం
  • నిందితుడు సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్ కి దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసును సీబీఐ విచారిస్తుండగా, ఇప్పటివరకు సంజయ్ రాయ్ ఒక్కడినే అరెస్ట్ చేశారు.

ఇవాళ సంజయ్ రాయ్ ని సెంట్రల్ కోల్ కతాలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నేర తీవ్రత దృష్ట్యా కోర్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కోర్టు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న నిరసనకారులు సంజయ్ రాయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. 

Kolkata Incident
Sanjay Roy
Judicial Remand
Custody
CBI
Kolkata
West Bengal
  • Loading...

More Telugu News