Megha Akash: పెళ్లిపీటలు ఎక్కనున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. సైలైంట్ గా నిశ్చితార్థం

Actress Megha Akash engagement
  • విష్ణు అనే కుర్రాడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్ మెంట్
  • నిన్న నిశ్చితార్థం జరగినట్టు వెల్లడించిన మేఘ
  • ఇన్స్టాలో ఫొటోలను షేర్ చేసిన నటి 
యంగ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. విష్ణు అనే కుర్రాడితో ఆమె నిన్న ఎంగేజ్ మెంట్ చేసుకుంది. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసింది. ఆగస్ట్ 22న ఎంగేజ్ మెంట్ జరిగినట్టు ఆమె తెలిపింది.

చెన్నైలో పుట్టి పెరిగిన మేఘా ఆకాశ్ హీరో నితిన్ సినిమా 'లై'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో సైతం పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. గత కొంత కాలం నుంచి మేఘా ఆకాశ్ పెళ్లిపై ప్రచారం జరుగుతోంది. తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడబోతోందనే రూమర్స్ వచ్చాయి. దీనిపై ప్రచారం కొనసాగుతుండగానే... ఎలాంటి హడావుడి లేకుండా విష్ణుతో ఆమె నిశ్చితార్థం చేసుకుంది. అయితే, విష్ణు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. పెళ్లిపీటలు ఎక్కబోతున్న మేఘకు ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Megha Akash
Tollywood
Kollywood
Engagement

More Telugu News