Jagan: అనకాపల్లికి బయల్దేరిన జగన్

Jagan left to Anakapalli
  • అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించనున్న జగన్
  • విశాఖ ఎయిర్ పోర్టు నుంచి అనకాపల్లిలోని ఆసుపత్రికి వెళ్లనున్న జగన్
  • సహాయక చర్యల్లో పాల్గొనాలని ఇప్పటికే పార్టీ శ్రేణులను ఆదేశించిన జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనకాపల్లికి బయల్దేరారు. అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్సియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఆయన పరామర్శించనున్నారు. జగన్ తొలుత విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రికి వెళతారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులను కూడా ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున సీఎం చంద్రబాబు ఇప్పటికే పరిహారాన్ని ప్రకటించారు.
Jagan
YSRCP
Anakapalli

More Telugu News