TTD: జైళ్ల‌శాఖ‌ డీఐజీ ర‌వికిర‌ణ్‌కు టీటీడీ జేఈఓ పోస్టు?

TTD JEO post to Prisons DIG Ravikiran
  • ఇప్ప‌టికే ఈ పోస్టు కోసం సీఎస్ వ‌ద్ద ద‌ర‌ఖాస్తు చేసుకున్న ర‌వికిర‌ణ్
  • ప్ర‌స్తుతం టీటీడీ జేఈఓలుగా వీర‌బ్ర‌హ్మం, గౌత‌మి
  • వీర‌బ్ర‌హ్మం స్థానంలో ర‌వికిర‌ణ్‌కు పోస్టింగ్‌?
జైళ్ల‌శాఖ‌లోని కోస్తాంధ్ర రేంజ్ డీఐజీ ఎంఆర్ ర‌వికిర‌ణ్‌కు టీటీడీ జేఈఓ పోస్టు ద‌క్క‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఆయన ఈ పోస్టు కోసం సీఎస్ వ‌ద్ద ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలిసింది. దాంతో ఆయ‌న నియామ‌క ప‌త్రం కూడా సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. 

ఇప్ప‌టివ‌ర‌కు ఐఏఎస్‌లు, ఐఆర్ఎస్‌లు, డిఫెన్స్ ఎస్టేట్ అధికారుల‌కు మాత్ర‌మే టీటీడీలో అవ‌కాశం ఇస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, జైళ్ల‌శాఖ అధికారిని డిప్యుటేష‌న్‌పై తీసుకుని, నియ‌మించేలా అవ‌కాశం క‌ల్పించి, ర‌వికిర‌ణ్‌కు పోస్టింగ్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లో ఉత్త‌ర్వులు వెలువ‌డుతాయ‌ని తెలుస్తోంది. 

కాగా, ప్ర‌స్తుతం టీటీడీ జేఈఓలుగా వీర‌బ్ర‌హ్మం, గౌత‌మి ఉన్నారు. వీరిలో వీర‌బ్ర‌హ్మం స్థానంలో ర‌వికిర‌ణ్‌ను నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.
TTD
Ravikiran
Andhra Pradesh

More Telugu News