Kolkata Horror: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం తర్వాత గూగుల్‌లో వారం రోజులుగా దారుణమైన వెతుకులాట!

Kolkata Horror Disturbing search trends for victims rape video
  • ఆర్‌జీ కర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్‌పై ఈ నెల 9న హత్యాచారం
  • విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే గూగుల్ సెర్చ్‌లో మునిగిన నెటిజన్లు
  • ఆమె పేరు, ఫొటోలు, వీడియో కోసం వెతుకులాట
  • వారం రోజులుగా ఇదే వరుస
కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ నెల 9న ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి, హత్య కేసు ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. విధుల్లో అలసిపోయి ఆసుపత్రి సెమినార్ హాల్లో నిద్రపోతున్న ఆమెపై ఓ మానవ మృగం దాడిచేసి చిదిమేసింది. 31 ఏళ్ల బాధితురాలిని చెప్పలేని, రాయలేని విధంగా అత్యాచారానికి తెగబడి, టార్చర్ చేసి మరీ నిందితుడు హత్య చేశాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 

గూగుల్ సెర్చ్‌లో మరో దారుణం
వైద్యురాలిపై హత్యాచారం తర్వాత కొందరు మరో దారుణానికి తెగబడ్డారు. గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోల్‌కతా ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కొందరు గూగుల్‌లో దూరిపోయి బాధితురాలి ఫొటోలు, అత్యాచార వీడియోల కోసం తెగ వెతికారు. అక్కడితో ఆగకుండా ఆమె పేరు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ‘వీడియో’, ‘రేప్ వీడియో’ అంటూ ఉత్సాహంగా వెతికారు. అంతేకాదు, ‘రేప్ పోర్న్’ అని గాలించారు.  గత వారం రోజులుగా ఇంటర్నెట్‌లో ఇదే వెతుకులాట కొనసాగుతోంది.
Kolkata Horror
RG Kar Hospital
Google Search
Google Trends

More Telugu News