హసీనాను విచారించాలి.. మాకు అప్పగించండి: భారత్ కు బంగ్లా పార్టీ డిమాండ్
- బంగ్లా మాజీ ప్రధానికి భారత్ ఆశ్రయమివ్వడం విచారకరమని వ్యాఖ్య
- హత్య కేసుల్లో హసీనాను విచారించాల్సి ఉందని వివరణ
- ఆందోళనలకు సంబంధించి మాజీ ప్రధానిపై 31 కేసుల నమోదు
రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన ఆందోళనలలో విద్యార్థులతో పాటు బీఎన్ పీ పార్టీ కూడా కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆందోళనలలో పలువురు ప్రాణాలు పోగొట్టుకోవడం, వారి మరణానికి కారణం మాజీ ప్రధాని హసీనా, ఆమె అనుచరులేనని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హసీనాపై రెండు హత్యలతో పాటు 31 కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి హసీనాను విచారించాల్సి ఉందని, న్యాయబద్ధంగా ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలని బీఎన్‌పీ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లామ్ ఆలంగిర్ కోరారు.