BMW: కియా, టెస్లా కార్లలో లోపాలు.. లక్షకు పైగా కార్లు వెనక్కి

Kia Tesla and others to recall over 1 lakh cars for faulty parts
  • విడిభాగాలు, సాఫ్ట్‌వేర్ లోపాలే కారణం
  • ఏడు వేర్వేరు మోడళ్లకు చెందిన 103,543 యూనిట్లు రీకాల్
  • ఈ నెల మొదట్లో 1.72 కార్లను వెనక్కి తీసుకున్న బీఎండబ్ల్యూ సహా నాలుగు కంపెనీలు
కార్ల తయారీలో పలు లోపాల కారణంగా దక్షిణ కొరియాలో లక్షకు పైగా కార్లను ప్రముఖ వాహన తయారీ కంపెనీలు కియా, టెస్లా, ఫోర్డ్ మోటార్, జీఎం కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకున్నాయి. విడిభాగాలు, సాఫ్ట్‌వేర్ లోపాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏడు వేర్వేరు మోడళ్లకు సంబంధించి మొత్తం 103,543 యూనిట్లను కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి.

టెస్లా మోడల్ వై కారులో హుడ్ సాఫ్ట్‌వేర్‌లో లోపం, కియా ప్రైడ్ కాంపాక్ట్ కార్లలో హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్, ఫోర్డ్ లింక్లన్ ఎంకేఎక్స్ ఎస్‌యూవీలో బ్రేక్ బూస్టర్‌లో లోపాలు, జీఎం కాడిల్లాక్ లిరిక్ ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్‌లో ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్‌లో లోపాలను గుర్తించిన కంపెనీలు వాటిని వెనక్కి పిలిపించాయి. ఆయా వాహనాలను ఉపయోగిస్తున్న వాహనదారులు వెంటనే వెనక్కి ఇవ్వాలని కోరాయి. 

ఈ నెల మొదట్లో బీఎండబ్ల్యూ కొరియా, హ్యుందయ్, కియా, కేజీఎం కమర్షియల్ కంపెనీలు 103 వేర్వేరు మోడళ్లకు చెందిన 1,72,976 లక్షల వాహనాలను కూడా ఇలాంటి కారణాలతోనే వెనక్కి తీసుకున్నాయి. ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్‌లో తప్పిదాలు, రెండో వరుస సీట్లలో ఎర్రర్  వంటి లోపాలను కూడా వీటిలో గుర్తించారు. అయితే, ఇవే లోపాలు ఇండియాలోనూ ఉన్నాయా? లేవా? అన్న దానిపై ఆయా కంపెనీలు స్పష్టత ఇవ్వలేదు.
BMW
KIA Motors
GM
Tesla
Business News

More Telugu News