Kolkata: ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన కేసులో మాజీ ప్రిన్సిపాల్ పై కేసు నమోదు

kolkata police registered corruption case against sandip ghosh
  • ఆర్జీ కార్ ఆసుపత్రి వ్యవహారంపై దీదీ సర్కార్ కీలక నిర్ణయం
  • ఆర్ధిక అవకతవకలపై ప్రత్యేక సిట్ ఏర్పాటు 
  • ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు
కోల్‌కతా ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో దీదీ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలను పరిశీలించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ ప్రణవ్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. నెలలోగా తొలి నివేదికను అందించాలని కోరింది. 
 
ఇదే క్రమంలో కోల్‌కతా పోలీసులు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై కేసు నమోదు చేశారు. కళాశాలలో ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న డాక్టర్ సంతోష్ ఘోష్ రాజీనామా చేశారు. అయితే ఈ ఘటనలో ఆయన సీబీఐ విచారణ ను ఎదుర్కొంటుండగా, సిట్ విచారణ, పోలీసు కేసు నమోదుతో మరింత ఉచ్చు బిగుసుకుంటోంది.

కాగా, ఆసుపత్రిలో ఆర్ధిక అవకతవకలపై జూన్ లోనే ఫిర్యాదులు నమోదు అయినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అప్పటి నుండి దానిపై విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా మాజీ ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు. 
Kolkata
Sandip Ghosh
cbi
West Bengal

More Telugu News