Telangana: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపాటు!

Revanth Reddy lashes out at KTR over comments on Rajiv statue
  • అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని విమర్శ
  • అనవసర ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరిక
  • డిసెంబర్ 9 లోపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ
సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే... తాము అధికారంలోకి వచ్చాక దానిని తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. అనవసర ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు. డిసెంబర్ 9 లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా... సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితరులు పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... దేశంలో విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారన్నారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

పంచాయతీరాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీ హయాంలోనే బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మార్చుతామని తెలిపారు.
Telangana
Revanth Reddy
Congress
KTR

More Telugu News