Autopsy Report: కోల్ కతా వైద్యురాలి హత్యాచారం... పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే..!

What Autopsy Report Of Kolkata Doctor Says About Injuries She Suffered
  • ఊపిరి ఆడకపోవడం వల్లే డాక్టర్ చనిపోయిందని తేల్చిన నివేదిక
  • మృతదేహంపై కనిపించిన తెల్లటి జిగురు పదార్థం వీర్యం కాదని వెల్లడి
  • శరీరంలో ఎముకలు విరిగిన ఆనవాళ్లు లేవని క్లారిటీ
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. డాక్టర్ మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని ఈ రిపోర్టు వెల్లడించింది. గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండవచ్చని పేర్కొంది. పలు జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం.. ఆర్జీ కర్ ట్రెయినీ డాక్టర్ మరణం ఊపిరి ఆడకపోవడం వల్ల సంభవించింది.

బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. డెడ్ బాడీపై తెల్లటి, చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే కానీ అది వీర్యం కాదని స్పష్టం చేసింది. అయితే, అదేమిటన్నది ఈ రిపోర్టు వెల్లడించలేదు. మృతదేహంలో పలు ఎముకలు విరిగాయనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది.
Autopsy Report
Kolkata Doctor
Semen
injuries
RG kar Hospital

More Telugu News