లారీని ఢీ కొట్టిన బైక్.. పల్నాడులో ముగ్గురి దుర్మరణం

Bike Accident In Palnadu District Three dead
--
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కగా నిలిపి ఉంచిన లారీని ఓ బైక్ వేగంగా ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. సోమవారం తెల్లవారుజామున అంజనీపురంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నాగతేజరెడ్డి, ఇందు, అమూల్య గురజాలలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. సోమవారం తెల్లవారుజామున ముగ్గురూ బైక్ పై పిడుగురాళ్లకు బయలుదేరారు. అయితే, బైక్ ను నడుపుతున్న నాగతేజరెడ్డి నిద్రమత్తు, అతివేగం కారణంగా అంజనీపురం సమీపంలో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వీరి బైక్ వేగంగా ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ముగ్గురూ స్పాట్ లోనే చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాఫ్తులో నాగతేజరెడ్డి నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెప్పారు.
Go Back to Shorts
Palnadu Accident
Andhra Pradesh
Three dead
Crime News

More Telugu News