BJP: కర్నూలు జిల్లాలో దారుణం.. వైసీపీని వీడి బీజేపీలో చేరిన నేత దారుణ హత్య

BJP leader who recently left YSRCP killed in Kurnool district
కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. ఇటీవలే వైసీపీని వీడి బీజేపీలో చేరిన నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆదోని మండలం పెద్దహరివాణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేఖన్న (50) మొన్నటి ఎన్నికల వరకు వైసీపీలోనే క్రియాశీలకంగా పనిచేశారు. ఇటీవలే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ఉదయం ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్నను దుండగులు గొంతు కోసి హత్య చేశారు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే శేఖన్నకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
BJP
Kurnool District
Adoni
Crime News

More Telugu News