Chandrababu: రేపు తిరుపతి శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన

AP CM Chandrababu will visit Tirupati Sri City tomorrow
  • శ్రీ సిటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న చంద్రబాబు
  • ఆయా సంస్థల ద్వారా రూ.900 కోట్ల పెట్టుబడులు
  • 2,740 మందికి ఉపాధి
  • మరో రూ.1,213 కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకోనున్న ఏపీ ప్రభుత్వం
ఏపీ సీఎం చంద్రబాబు రేపు (ఆగస్టు 19) తిరుపతి శ్రీ సిటీలో పర్యటించనున్నారు. శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీ సిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 

ఆయా సంస్థల ద్వారా రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి లభించనుంది. మరో 1,213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రేపటి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు. 

కాగా, చంద్రబాబు రేపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ పర్యటించనున్నారు. ఇక్కడి సోమశిల ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమశిలలో వరదలకు దెబ్బతిన్న కట్ట పనులను పరిశీలించనున్నారు.
Chandrababu
Sri City
Tirupati
TDP-JanaSena-BJP Alliance

More Telugu News