Instagram Reels: స్కూటర్‌తో ప్రమాదకరంగా రోడ్డుపై స్టంట్స్.. లాక్కుని బ్రిడ్జిపై నుంచి కిందపడేసి బుద్ధి చెప్పిన ప్రజలు.. వీడియో ఇదిగో!

Angry Over Performing Dangerous Stunts For Instagram Reels Mob Throws Youths Scooter Off Bridge
  • బెంగళూరు-తుముకూరు రోడ్డుపై ప్రమాదరకంగా స్టంట్స్
  • ఆగ్రహంతో స్కూటీ లాక్కున్న ఇతర వాహనదారులు
  • బ్రిడ్జిపై నుంచి కింద పడేయడంతో తుక్కుతుక్కైైన స్కూటీ
ఇటీవలి కాలంలో రీల్స్ మోజులో ప్రాణాలు కోల్పోతున్న యువత సంఖ్య పెరుగుతోంది. రీల్స్ కోసం ప్రమాదకరంగా స్టంట్స్ చేయడం.. జలపాతాల వద్దకు వెళ్లడం కారణంగా ఇటీవల ఎంతోమంది చనిపోయారు. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా యువతలో మార్పు రావడం లేదు. 

తాజాగా బెంగళూరు-తుముకూరు జాతీయ రహదారిపై రోడ్డు మధ్యలో స్కూటర్‌తో ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తున్న యువకుడికి స్థానికులు బుద్ధి చెప్పారు. అతడిని అడ్డుకుని వాహనాన్ని లాక్కుని బ్రిడ్జిపై నుంచి కిందపడేశారు. అంతెత్తు నుంచి పడడంతో అది తుక్కుతుక్కు అయింది. యువకుడు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. అందరూ కలిసి అతడిని అడ్డుకుని స్కూటర్ లాక్కుని బ్రిడ్జిపై నుంచి అమాంతం ఎత్తిపడేశారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే ఇంకొకటి జరిగింది. ఓ యువతి ఆరో అంతస్తు నుంచి రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా చేతిలోంచి మొబైల్ జారిపోయింది. దీంతో దానిని పట్టుకునే ప్రయత్నంలో కిందపడి తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోంది.
Instagram Reels
Bengaluru
Mob Throws

More Telugu News