Revanth Reddy: ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ ఉండాలి: రేవంత్ రెడ్డి

Revanh Reddy suggetion on Regional ring road
  • ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించిన సీఎం
  • ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళిక ఉండాలన్న సీఎం
  • యుద్ధ ప్రాతిపదికన ఫ్యూచర్ సిటీ పనులు చేపట్టాలన్న రేవంత్ రెడ్డి
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ రూట్ మ్యాప్‌ను అధికారులు... ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకూ కనెక్టివిటీ ఉండేలా చూడాలన్నారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు.

అలాగే, రోడ్డు, మెట్రో మార్గాల భూసేకరణ, ఇతర అంశాలపై సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హకీంపేట లేదా గచ్చిబౌలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రతిపాదించారు. స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైన్స్ సహా దాదాపు డజనుకు పైగా కోర్సులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
Revanth Reddy
Congress
Telangana
Hyderabad

More Telugu News