Samantha: దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల వేళ ముంబైలో తొలిసారి కనిపించిన సమంత

Actress Samantha Spotted In Mumbai First Time After Dating Rumours With Raj Nidimoru
  • ఇటీవల నాగచైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం
  • ఆ వెంటనే సమంత రెండో పెళ్లిపై వార్తలు హల్‌చల్
  • రాజ్ & డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్: హనీ బన్నీ" లో సమంత
దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉందంటూ రూమర్లు వినిపిస్తున్నవేళ తాజాగా  ఆమె  ముంబైలో కనిపించింది . ఆమె తన కారులో కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతున్న ఫొటోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కలిసి ‘రాజ్ అండ్ డీకే’గా కలిసి సినిమాలు చేస్తుంటారు. వీరితో  కలిసి సమంత గతంలో ‘ఫ్యామిలీమ్యాన్ 2’ సీజన్‌లో పనిచేసింది. ప్రస్తుతం మళ్లీ వారి కాంబినేషన్‌లోనే ‘సిటాడెల్: హనీ బన్నీ’ చేస్తోంది. ఇందులో ఆమె సరసన వరుణ ధావన్ నటిస్తున్నాడు.

సమంత మాజీ భర్త నాగచైతన్య ఇటీవల శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత సమంత కూడా త్వరలోనే పెళ్లికి సిద్దమవుతోందంటూ ఇంటర్నెట్‌లో వార్తలు హల్‌చల్ చేశాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో  వారిద్దరి డేటింగ్ వార్తలు నిజమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Samantha
Raj Nidimoru
Bollywood
Samantha Dating

More Telugu News