IPS: ఏపీలో పలువురు ఐపీఎస్ లకు స్థానచలనం

AP Govt transferes IPS officers
 
ఏపీలో ఉన్నతాధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. నేడు మరికొందరు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. 

అనంతపురం జిల్లా ఎస్పీగా పి.జగదీశ్, ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్ గా కేవీ మురళీకృష్ణ, విజయవాడ డీసీపీగా కేఎమ్ మహేశ్వర్ రాజు... గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్లుగా గరుడ్ సుమిత్ సునీల్, సునీల్ షరాన్... గుంతకల్ ఎస్సార్పీగా రాహుల్ మీనా (రైల్వే పోలీస్), ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, పార్వతీపురం ఎస్డీపీవోగా అంకిత మహావీర్ లను బదిలీ చేశారు. 

సత్య ఏసుబాబును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
IPS
Transfer
Andhra Pradesh

More Telugu News