Hyderabad: ఢిల్లీలో రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ చైర్మన్ భేటీ... త్వరలో హైదరాబాద్ వస్తానని హామీ

Foxconn Chairman will visit Hyderabad soon
  • ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన ముఖ్యమంత్రి
  • పరిశ్రమలు, సేవా రంగాలను విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందన్న యంగ్ లి యు
  • ముఖ్యమంత్రి విజన్ అద్భుతమని కొనియాడిన ఫాక్స్ కాన్ చైర్మన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లి యు కలిశారు. రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు పలు కంపెనీల ప్రతినిధులు ఆయనను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఫాక్స్ కాన్ చైర్మన్... దేశ రాజధానిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు.

త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తానని ఈ సందర్భంగా యంగ్ లి యు తెలిపారు. పరిశ్రమలు, సేవా రంగాలను విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో ముఖ్యమంత్రి విజన్ అద్భుతమని కొనియాడారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు సానుకూలత ఉందన్నారు.
Hyderabad
Revanth Reddy
Congress
Telangana

More Telugu News