Chandrababu: ఇవాళ నా పాత స్నేహితుడితో సమావేశం గొప్పగా జరిగింది: సీఎం చంద్రబాబు

CM Chandrababu held meeting with TATA Sons Chariman Natarajan Chandrasekaran
  • అమరావతి విచ్చేసిన టాటా సన్స్ ప్రతినిధి బృందం
  • ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ
  • వివిధ అంశాలపై చర్చ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ టాటా సన్స్ ప్రతినిధి బృందంతో సమావేశం కావడం తెలిసిందే. దీనిపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

"అమరావతిలో ఇవాళ నా పాత స్నేహితుడు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో సమావేశం గొప్పగా జరిగింది. ఆర్థికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047ని దృష్టిలో ఉంచుకుని మేధావులు, పారిశ్రామిక దిగ్గజాలు సభ్యులుగా ఏపీ ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ టాస్క్ ఫోర్స్ కు నటరాజన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్ గా వ్యవహరిస్తారని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 

అంతేకాదు, అమరావతిలో సీఐఐ ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటీటివ్ నెస్ (జీఎల్ సీ)లో భాగస్వామిగా ఉండేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది. ఇక, విశాఖలో టీసీఎస్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు గల అవశాలపై కూడా నేటి సమావేశంలో చర్చించాం. 

ఏపీని ఇతర ప్రాంతాలతో మరింతగా అనుసంధానించేలా ఎయిరిండియా, విస్తారా విమానయాన సేవల విస్తరణ పైనా... వివిధ రంగాల్లో భాగస్వామ్యంపైనా చర్చించాం" అని చంద్రబాబు వివరించారు. కాగా, ఈ సమావేశంలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.
Chandrababu
Natarajan Chandrasekaran
Chariman
TATA Sons
Amaravati

More Telugu News