: కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కొడతా: దళితనేత

టీఆర్ఎస్ పార్టీ నుంచి తనను ఎందుకు తొలగించారో కేసీఆర్ వివరణ ఇవ్వాలంటున్నాడు చింతస్వామి అనే తెలంగాణ దళితనేత. లేకుంటే, ఆదివారంనాడు ఆయన ఇంటి ముందు చావు డప్పు మోగించడం తథ్యమని హెచ్చరించారు. హైదరాబాద్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడని, ముఖ్యంగా మాదిగలను ఏమార్చడానికి యత్నిస్తున్నాడని ఆరోపించారు. 13 ఏళ్ళుగా పార్టీకి విధేయుడిగా ఉన్న తనను కారణం చెప్పకుండా తొలగించడం సబబు కాదని అన్నారు. కేసీఆర్.. పార్టీలో అణచివేత, గెంటివేత సిద్ధాంతం అమలు చేస్తూ దళితుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నాడని చింతస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News