Narendra Modi: వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi will tour USA in next month
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరులో అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు. సెప్టెంబరు 22న భారతీయ-అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం కోసం లాంగ్ ఐలాండ్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇక, సెప్టెంబరు 26న జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మోదీ  ప్రసంగించనున్నారు. సెప్టెంబరు 26 నుంచి 30 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రసంగించే దేశాధినేతల జాబితాను ఐక్యరాజ్యసమితి తాజా విడుదల చేసింది.
Go Back to Shorts
Narendra Modi
US
UN
India

More Telugu News