Varudhu Kalyani: చంద్రబాబు అభిమాన సంఘం అధ్యక్షురాలిగా షర్మిల వ్యవహరిస్తున్నారు: వరుదు కల్యాణి

YS Sharmila is behaving like Chandrababu fan club president says Varudhu Kalyani
  • ఆరోగ్యశ్రీపై షర్మిల వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలన్న కల్యాణి
  • చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారని విమర్శ
  • వైద్య రంగానికి జగన్ రూ. 32 వేల కోట్లను ఖర్చు చేశారని వ్యాఖ్య
ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమాన సంఘం అధ్యక్షురాలిగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై నిజాలు తెలుసుకుని మాట్లాడాలని షర్మిలకు హితవు పలికారు. పచ్చ కళ్లద్దాలను తీసేసి, వాస్తవాలను మాట్లాడాలని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారని మండిపడ్డారు. 

వైద్య రంగానికి జగన్ రూ. 32 వేల కోట్లను ఖర్చు చేశారని... ఆరోగ్యశ్రీకి రూ. 15 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని కల్యాణి చెప్పారు. ఆరోగ్యశ్రీకి చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత?అని ప్రశ్నించారు. 

చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ కింద 1,000 వ్యాధులకు మాత్రమే వైద్యం చేసేవారని... జగన్ సీఎం అయిన తర్వాత 3 వేలకు పైగా వ్యాధులకు వైద్యం అందించారని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష వ్యవస్థలను తీసుకొచ్చిన ఘనత జగన్ దని కొనియాడారు. 

సీఎంగా చంద్రబాబు దిగిపోయే సమయానికి ఆరోగ్యశ్రీలో రూ. 700 కోట్ల బకాయిలు ఉన్నాయని... వాటిని జగన్ చెల్లించారని చెప్పారు. జగన్ గురించి షర్మిల పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని... షర్మిల వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు.
Varudhu Kalyani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
YS Sharmila
Congress
Aarogya Sri

More Telugu News