Anna Canteens: అన్న క్యాంటీన్లను చంద్రబాబు పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చారు: వైసీపీ

Chandrababu made Anna Canteens as paisa vasool canteens says YSRCP
  • అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చంద్రబాబు కలరింగ్ ఇచ్చారన్న వైసీపీ
  • ఇప్పుడు ప్రజల సొమ్మును దోచుకునేందుకు ప్లాన్ వేశారని విమర్శ
  • ప్రజల నుంచి విరాళాల సేకరణ అంటున్నారని ఎద్దేవా
ఏపీలో అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అన్న క్యాంటీన్లను చంద్రబాబు పైసా వసూల్ కేంద్రాలుగా మార్చారని విమర్శించింది. 

ప్రభుత్వమే అన్న క్యాంటీన్లను నిర్వహిస్తుందని ఇంతకాలం కలరింగ్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టింది. ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మరో ప్లాన్ వేశారని ఆరోపించింది. అన్న క్యాంటీన్లకు టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారని... ఇప్పుడు ప్రజల నుంచి విరాళాల సేకరణ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైసీపీ విమర్శలు గుప్పించింది. 

అన్న క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలు భాగస్వాములు కావాలని... విరాళాలు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేసింది.
Anna Canteens
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News