Ayyanna Patrudu: వైసీపీ ప్రభుత్వంపై మరోసారి అయ్యన్నపాత్రుడు విమర్శలు

Ayyanna Patrudu comments on YSRCP
  • వైసీపీ ప్రభుత్వంలో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందన్న అయ్యన్న
  • అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని పిలుపు
  • అసెంబ్లీకి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రావాలని విన్నపం
గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని... రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అందరం కలసికట్టుగా కృషి చేయాలని ఆయన అన్నారు. అమరావతిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. మనందరం సంతోషంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే... దానికి ఎందరో పెద్దల ప్రాణ త్యాగాలే కారణమని అన్నారు. రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం అందరం బాధ్యతతో పని చేయాల్సి ఉందని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు హాజరు కావాలని... సభలో అర్థవంతమైన చర్చ జరగాలని చెప్పారు.
Ayyanna Patrudu
Telugudesam
YSRCP

More Telugu News