YS Jagan: ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు: వైఎస్ జగన్

Jagan congratulated the people of the state on Independence Day
  • దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్
  • స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ జగన్ నివాళులు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ప్రతి భారతీయుడి హృద‌యం గ‌ర్వంతో నిండే రోజు అని జగన్ అన్నారు. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజని.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు.
 
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 

YS Jagan
YSRCP
Andhra Pradesh
Independence Day

More Telugu News