Nara Lokesh: నాది రెడ్ బుక్ మాత్రమే కాదు.. ఓపెన్ బుక్: జ‌గ‌న్‌కు లోకేశ్ కౌంట‌ర్‌

Nara Lokesh Criticizes YS Jagana
రెడ్ బుక్‌పై వైసీపీ చేస్తున్నది దుష్ప్ర‌చారమంటూ మంత్రి నారా లోకేశ్ కౌంట‌రిచ్చారు. త‌న‌ది రెడ్ బుక్ కాద‌ని, ఓపెన్ బుక్ అని ఆయ‌న ట్వీట్ చేశారు. "ఫేకు జగన్.. నాది రెడ్ బుక్ మాత్రమే కాదు ఓపెన్ బుక్ కూడా! నీలా నాపై మనీ లాండరింగ్ వ్యవహారాలు, సీబీఐ కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే నీ మాదిరిగా కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలకు వెళ్లా. జనాలు కొట్టిన స్లిప్పర్ షాట్ నుండి కోలుకోవడానికి కొంత స‌మ‌యం పడుతుంది. చిల్ బ్రో! సరే కానీ బాబాయ్ ను లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్?" అని లోకేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
Nara Lokesh
YS Jagana
Andhra Pradesh

More Telugu News