Sunkishala: సుంకిశాల ఇష్యూ... అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం

Government takes action officers over Sunkishala issue
  • ప్రాజెక్ట్ గేటు, రక్షణ గోడ ప్యానల్ కూలిపోవడంపై ప్రభుత్వం సీరియస్
  • ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై బదిలీ వేటు
  • నలుగురు అధికారుల సస్పెన్షన్
సుంకిశాల ప్రాజెక్ట్ గేటుతో పాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్‌పై బదిలీ వేటు వేసింది. సుంకిశాల ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ సర్కిల్-3 అధికారులను సస్పెండ్ చేసింది. సీజీఎం కిరణ్, జీఎం మరియరాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్‌లను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి దానకిశోర్ ఆదేశాలు జారీ చేశారు.

సుంకిశాల ఘటనపై అంతర్గత విచారణ జరిగింది. విచారణ జరిపిన కమిటీ... నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. అలాగే నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Sunkishala
Telangana

More Telugu News