BRS: గుంపు మేస్త్రి గారికి స్వ‌దేశాగ‌మ‌న శుభాకాంక్ష‌లు.. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సెటైరిక‌ల్ స్వాగ‌తం!

BRS Party Satirical Tweet on CM Revanth Reddy
విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి ఇవాళ తిరిగివస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సెటైరిక‌ల్ స్వాగ‌తం ప‌లికింది. "ప‌ది రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో సోద‌రుడు ఎనుముల జ‌గ‌దీశ్ రెడ్డి గారు నూత‌నంగా స్థాపించిన కంపెనీతో రూ. 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని నేడు స్వ‌దేశానికి తిరిగి వ‌స్తున్న మా గుంపు మేస్త్రి గారికి స్వ‌దేశాగ‌మ‌న శుభాకాంక్ష‌లు. ఇట్లు బ్యాగ్‌మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేష‌న్" అని ఈ బ్యాన‌ర్‌ను 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) లో పోస్ట్ చేసింది. 

కాగా, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. నిన్న‌టితో ఆయ‌న రెండు దేశాల ప‌ర్య‌ట‌న ముగిసింది. దాంతో ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటార‌ని స‌మాచారం.
BRS
Revanth Reddy
Telangana

More Telugu News