వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు
- నాగ చైతన్య, శోభిత భావి జీవితంపై వేణుస్వామి సంచలన జోస్యం
- ఆయనపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్
- గతంలో కూడా వివిధ సినీ, రాజకీయ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు
వేణుస్వామి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా, ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, వేణు స్వామిని ఈ నెల 22న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఇది మొదటిసారి కాకపోయినా, గతంలో కూడా వేణు స్వామి పలువురు టాలీవుడ్ స్టార్ల కెరీర్, వివాహాలు, అలాగే రాజకీయ ఫలితాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చేసిన జోస్యం తప్పడంతో అప్పట్లో కూడా ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ అయిన తరువాత, చైతన్య-శోభిత వివాహ నిశ్చితార్థం పై వ్యాఖ్యలు చేయడంతో మరోసారి వివాదాస్పదం అయింది.