Ambati Rambabu: వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం: అంబ‌టి రాంబాబు ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

Ambati Rambabu Tweet on Botsa Satyanarayana
 
ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో వైసీపీ అభ్యర్థి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌యం దాదాపు ఖాయం కావ‌డంపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. 

'వైఎస్ఆర్‌సీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం!' అని ట్వీట్ చేశారు. కాగా, ఈ ఉప ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని ఎన్‌డీఏ కూట‌మి నిర్ణ‌యించిన విష‌యం తెలిసింది. బొత్స‌తో పాటు మ‌రో స్వ‌తంత్ర అభ్య‌ర్థి ష‌ఫీ ఉల్లా పోటీలో ఉన్నారు.
Ambati Rambabu
Botsa Satyanarayana
YSRCP
Andhra Pradesh

More Telugu News