Janhvi Kapoor: త‌ల్లి పుట్టిన‌రోజున తిరుమ‌ల‌కు జాన్వీ క‌పూర్‌

Janhvi Kapoor Visit Tirupati Temple on her Mother Birthday
  • నేడు శ్రీదేవి జ‌యంతి
  • మెట్ల దారిలో వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకున్న కూతురు జాన్వీ
  • త‌ల్లికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఇన్‌స్టాలో స్పెష‌ల్‌ పోస్ట్
  • తిరుప‌తి మెట్లు, త‌ల్లితో త‌న చిన్న‌ప్ప‌టి ఫొటో షేర్ చేసిన జాన్వీ
నేడు అల‌నాటి న‌టి శ్రీదేవి జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఆమె కుమార్తె జాన్వీ క‌పూర్ తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. మెట్ల దారి మీదుగా కొండపైకి చేరుకుని స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ప్ర‌తీ ఏటా జాన్వీ ఇదే అనుస‌రిస్తుంటారు. 

ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఇన్‌స్టాలో ఆమె ఒక పోస్ట్ చేశారు. ఇందులో తిరుప‌తి మెట్లు, త‌ల్లితో త‌న చిన్న‌ప్ప‌టి ఫొటో, తాను చీర‌లో ఉన్న ఫొటోల‌ను షేర్ చేశారు. 'హ్యాపీ బ‌ర్త్ డే అమ్మా. ఐ ల‌వ్యూ' అని దానికి క్యాప్ష‌న్ ఇచ్చారు. కాగా, తిరుప‌తి అన్నా, తాను చీర క‌ట్టినా త‌న త‌ల్లికి చాలా ఇష్ట‌మ‌ని జాన్వీ ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు. 

ఇక జాన్వీ క‌పూర్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. జూనియ‌ర్ ఎన్‌టీఆర్ స‌ర‌స‌న న‌టిస్తున్న 'దేవ‌ర' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారామె. ఈ సినిమా నుంచి విడుద‌లైన ఆమె పోస్ట‌ర్‌, సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాగే గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు స‌న కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా జాన్వీ ఎంపిక‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్‌పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.
Janhvi Kapoor
Tirupati Temple
TTD
Andhra Pradesh
Sridevi

More Telugu News