ఏడాదికి రూ.25 లక్షల వేతనం మరీ తక్కువంటున్న ఇన్వెస్టర్
- ఆ మొత్తంతో కుటుంబాన్ని నడపలేం.. ఇక పొదుపు ఎలా చేస్తామని సౌరవ్ దుత్తా ప్రశ్న
- దుత్తా ట్వీట్ పై సోషల్ మీడియాలో డిబేట్
- ఫన్నీగా కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
ఇదీ దత్తా లెక్క..
ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. నెలవారీగా ఈ కుటుంబం కనీస అవసరాలు ప్లస్ ఇంటి అద్దె లేదా ఈఎంఐలకు రూ.1 లక్ష వెచ్చించాల్సి వస్తుందని, వారానికో రెండు వారాలకో బయట తినడానికి, సినిమాలు, ఓటీటీ, డే ట్రిప్స్ కు రూ.25 వేలు, ఎమర్జెన్సీ అవసరాలు, వైద్యం కోసం రూ.25 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని సౌరవ్ దత్తా చెప్పుకొచ్చారు. నెలనెలా ఫస్ట్ కు వచ్చిన జీతం ఇలా ఖర్చులకే సరిపోతే పొదుపు మాటేమిటని ప్రశ్నిస్తూ దత్తా ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో చర్చ..
సౌరవ్ దత్తా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. చాలామంది నెటిజన్లు ఈ ట్వీట్ పై ఫన్నీగా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయంలను దృష్టిలో పెట్టుకుని చూస్తే దత్తా అభిప్రాయం కరెక్టేనని వాదిస్తున్నారు.