Realme C63 5G: బడ్జెట్ ధరలో అదిరిపోయే 5జీ ఫోన్‌ విడుదల చేసిన రియల్‌మీ

Realme has introduced its latest budget friendly Realme C63 5G smartphone in the Indian market
  • రియల్‌మీ సీ63 5జీ ఫోన్‌ను ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం
  • ఆకర్షణీయమైన ఫీచర్లతో పరిచయం చేసిన కంపెనీ
  • ప్రారంభ ధర రూ.10,999గా ప్రకటన
స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం రియల్‌మీ మరోకొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం వంటి ఆకట్టుకునే ఫీచర్లతో ‘రియల్‌మీ సీ3 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 

రియల్‌మీ సీ63 5జీ బేస్ మోడల్ 4జీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.10,999గా ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 11,999గా, టాప్ మోడల్ అయిన 8జీబీ, 128జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.12,999గా ఉన్నాయి. 

రెండు రంగుల వేరియంట్‌లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 20 మధ్యాహ్నం నుంచి అమ్మకాలు ప్రారంభమవనున్నాయని కంపెనీ తెలిపింది. రియల్‌మీ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌పై అమ్మకాలు జరుగుతాయని కంపెనీ వివరించింది. సేల్ ఆరంభం సందర్భంగా కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తాయని, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లింపులు చేసి రూ.1000 వరకు తగ్గింపును పొందవచ్చునని, తద్వారా ఫోన్ రూ.9,999లకే లభించనుందని రియల్ మీ వివరించింది.

ఫోన్ ప్రత్యేకతలు ఇవే..
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్‌, 14-బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0 ఆండ్రాయిడ్‌పై రియల్‌మీ సీ63 5జీ పనిచేస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 6.67-అంగుళాలు (హెడ్‌డీ+ (720x1,604 పిక్సెల్స్) ఉంది. రిఫ్రెష్ రేట్ 120హెడ్జ్, 625 నిట్స్ బ్రైట్‌నెస్‌, 192 గ్రాముల బరువు ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. 

కెమెరా విషయానికి వస్తే 32-మెగాపిక్సెల్ ఏఐ సామర్థ్యం ఉన్న ప్రధాన కెమెరా వెనుకవైపు ఉంది. ఈ కెమెరాతో హైక్వాలిటీ ఫోటోలు తీయవచ్చు. ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందించింది. 

బ్యాటరీ కెపాసిటీ 5,000 ఎంఏహెచ్‌గా ఉంది. 10వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో స్పీడ్‌గా ఛార్చ్ చేసుకోవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 2టెరా బైట్లకు వరకు ఫోన్ స్టోరేజీ కెపాసిటీని పెంచుకోవచ్చు. 

కనెక్టివిటీ విషయానికి వస్తే వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌కు 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు, 2 ఏళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లపై రియల్ మీ భరోసా ఇచ్చింది. 
Realme C63 5G
Realme
Realme Smart Phones
New Smart Phones

More Telugu News