లంచంగా 5 కేజీల బంగాళదుంపల డిమాండ్.. ఎస్సైని సస్పెండ్ చేసిన ఎస్పీ
- ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘటన
- ఓ కేసులో ఐదు కేజీల బంగాళదుంపలు డిమాండ్ చేసిన ఎస్సై
- రెండు కేజీలు మాత్రమే ఇవ్వగలనన్న బాధితుడు
- కుదరదన్న ఎస్సై.. మిగతా మూడు కేజీలు తర్వాత ఇవ్వాలని షరతు
- వీడియో వైరల్ కావడంతో ఎస్సైని సస్పెండ్ చేసిన ఎస్పీ
వైరల్ అయిన ఆడియోలో బాధితుడు తాను రెండు కిలోల బంగాళదుంపలు మాత్రమే ఇవ్వగలనని వేడుకున్నాడు. అయితే, అలా కుదరదని, ముందుగా అనుకున్నట్టు 5 కిలోల దుంపలు ఇస్తేనే కేసు సంగతి తేలుస్తానని ఎస్సై తేల్చి చెప్పాడు. అయితే, అందుకు తన ఆర్థిక పరిస్థితి సహకరించదని బాధితుడు వేడుకోవడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపించింది. దీంతో ఎస్సై స్పందిస్తూ.. తొలుత రెండు కిలులు ఇచ్చి ఆ తర్వాత మిగతా మూడు కిలోలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.