Third Wave Coffee: కాఫీషాప్ లో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్.. ఫ్లైట్‌మోడ్‌లో పెట్టి కెమెరా ఆన్ చేసి వీడియోల చిత్రీకరణ

Bengaluru cafe staffer hides phone in womens washroom with video on
  • బెంగళూరులోని థర్డ్‌వేవ్ కాఫీషాప్‌లో ఘటన
  • 23 ఏళ్ల మహిళ అప్రమత్తతతో విషయం వెలుగులోకి
  • కాఫీ సిబ్బందిలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
మహిళలకు ఎక్కడా భద్రత లేదని మరోమారు నిరూపితమైంది. బెంగళూరులోని ఓ పాప్యులర్ కేఫ్‌ వాష్‌రూంలోని డస్ట్‌బిన్‌లో ఫోన్‌ పెట్టి మహిళల వీడియోలు చిత్రీకరిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాష్‌రూంలోకి వెళ్లిన మహిళ అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది.

బీఈఎల్ రోడ్డులోని థర్డ్‌వేవ్ అనే కాఫీషాప్ అవుట్‌లెట్‌ లో 23 ఏళ్ల ఓ మహిళ వాష్‌రూం ఉపయోగించుకునేందుకు వెళ్లింది. అక్కడి డస్ట్‌బిన్‌లో ఆమెకు అనుమానాస్పద వస్తువేదో కనిపించింది. వెంటనే వెళ్లి చూడగా ఓ మొబైల్ ఫోన్ కెమెరా ఆన్‌చేసి కనిపించింది. టాయిలెట్‌ను చిత్రీకరించేలా ఉన్న ఆ ఫోన్‌లోని కెమెరా రెండు గంటలుగా ఆన్‌లో ఉన్నట్టు గుర్తించింది. అంతేకాదు, దానికి ఫోన్లు రాకుండా ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఉంది. కాఫీ షాపులో పనిచేస్తున్న ఇద్దరిలో అది ఏ ఒక్కరిదో అయి ఉంటుందని భావించింది.

పోలీసులకు ఫోన్ చేయడంతో వారొచ్చి నిందితుడు మనోజ్‌ను అరెస్ట్ చేశారు. గుట్టహళ్లిలో ఉంటున్న నిందితుడిది షిమోగా అని, ఆరు నెలల క్రితమే అతడు కాఫీ షాప్‌లో చేరినట్టు గుర్తించారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ సినీపూర్’ పేరుతో నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఖాతాలో బాధిత మహిళ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా దీనిని దురదృష్టకర ఘటనగా పేర్కొన్న కాఫీషాప్ మహిళకు క్షమాపణలు తెలిపింది.
Third Wave Coffee
Bengaluru
Crime News
Gangs Of Cinepur

More Telugu News