బీహార్‌లోని సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి
- మృతుల్లో ఆరుగురు మహిళలు.. 12 మందికిపైగా గాయాలు
- శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయానికి పెద్ద ఎత్తున మహిళలు
- రాత్రి 1.00 గంట సమయంలో తొక్కిసలాట
శ్రావణ మాసం నాలుగో సోమవారం (మనకి కాదు) పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉండడం, సమయం గడుస్తున్న కొద్దీ మరింత మంది భక్తులు వచ్చి చేరుతుండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.