భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు .. అయిదుగురు అరెస్టు
- విశాఖ నుండి తమిళనాడుకు గంజాయి అక్రమ రవాణ
- గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన సెబ్ అధికారులు
- రెండు కార్లు సీజ్, 230 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ నుండి తమిళనాడుకు రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో సెబ్ అధికారులు మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేశారు. రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వాహనాలను సీజ్ చేశారు. అయిదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ అయిదుగురు వ్యక్తులు గత కొంత కాలంగా విశాఖ నుండి గంజాయి తీసుకొస్తున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు.