TDP: పార్టీ నిండా రౌడీలు, సైకోలేనా?: టీడీపీ

TDP Criticizes YSRCP
వైసీపీ ఎంఎల్‌సీ దువ్వాడ శ్రీనివాస్ వ్య‌వ‌హారంపై టీడీపీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. "పార్టీ నిండా రౌడీలు, ఖూనీకోరులు, డెకాయిట్లు, సైకోలు, కామాంధులని పెట్టుకుని సేవ్ డెమోక్రసీ అంటున్న నిన్ను ఏమనాలి జ‌గ‌న్? అసలు నీది ఒక రాజకీయ పార్టీయేనా?" అంటూ ట్వీట్ చేసింది. 

కాగా, త‌న భ‌ర్త వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని ఆరోపిస్తూ, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ‌ద్ద ఆయ‌న భార్య వాణి ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. దీంతో శ్రీనివాస్ ఆగ్ర‌హంతో ఆమెను కొట్టేందుకు వెళ్లారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు మీడియాకు ఎక్క‌డంతో ర‌చ్చ న‌డుస్తోంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన భార్య వాణి నుంచి చట్టపరంగా విడాకులు తీసుకుంటానని వెల్లడించారు.
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News